27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ అదనపు డిసిపి (అడ్మిన్) జి.బస్వారెడ్డి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఉంటుందని నిజామాబాద్ అదనపు డిసిపి (అడ్మిన్) జి.బస్వారెడ్డి అన్నారు. పోలీస్ సిబ్బంది పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వ హించారు.  ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డిసిపి (అడ్మిన్) జి.బస్వారెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు.  ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, డిపార్టుమెంటుకు చేసిన సేవలు ఎంతో ఘననీయమని కొనియాడారు. పదవి విరమణ అనంతరం ఎలాంటి అవసరం వచ్చిన ఎల్లవేళలా సహయపడుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన సిబ్బందికి శాలువతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్,  స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ తిరుపతి, షకీల్ పాష, వారికుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article