27.3 C
Hyderabad
Friday, July 31, 2026

పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో మండల పంచాయితీ అధికారిగా విధులు నిర్వహించిన పాతూరి లక్ష్మారెడ్డి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డి పంచాయతీ అధికారిగా ప్రజలకు ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తు  సమస్యలను పరిష్కరించారని అన్నారు. అనంతరం ఆయనకు నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సెక్రెటరీలు, పలువురు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తారాబాయి, డిఆర్డిఒ సాయాగౌడ్, ఎంపిడిఓ భీమ్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, సోసైటీ మాజీ చైర్మన్ పత్తి రాము, నాయకులు పత్తి లక్ష్మణ్, అక్కపల్లి నాగేందర్, తోట సంగయ్య, ఇమ్రాన్, పంచాయతీ సెక్రటరీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article