24.8 C
Hyderabad
Friday, July 31, 2026

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ముస్తాబాద్ మండల నామాపూర్ గ్రామం లోని తెలంగాణ మోడల్  స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, టాయిలెట్స్, స్టోర్ రూమ్ లను స్వయంగా  తిరిగి పరిశీలించారు. విద్యార్థులచే హిందీ ఇంగ్లీష్ పాఠాలను చదివించి పలు ప్రశ్నలు అడిగి సమాదానాలు రాబాట్టారు. స్కూల్ లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారు ఏమి తిన్నారు, ఫుడ్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు టేబుల్ టెన్నిస్ గేమ్స్ ఆడాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల హాజరు వివరాలు స్వయంగా పరిశీలించిన కలెక్టర్ అటెండెన్స్ వివరాలను పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

Provide quality education to students

More articles

Latest article