పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో మండల పంచాయితీ అధికారిగా విధులు నిర్వహించిన పాతూరి లక్ష్మారెడ్డి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డి పంచాయతీ అధికారిగా ప్రజలకు ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తు సమస్యలను పరిష్కరించారని అన్నారు. అనంతరం ఆయనకు నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సెక్రెటరీలు, పలువురు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తారాబాయి, డిఆర్డిఒ సాయాగౌడ్, ఎంపిడిఓ...