నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగానికి చెందిన డా.గుల్-ఎ-రానా కు టేక్సెస్ యూనివర్సిటీ ఆస్టీన్ లో ఉర్దూ సాహిత్యంలో అనుహ్య కృషికి గౌరవం దక్కింది. తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్, డా.గుల్-ఎ-రానా ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఉర్దూ అధ్యయన కేంద్రమైన టేక్సెస్ యూనివర్సిటీ ఆస్టీన్ లో ఆమె చేసిన అద్భుతమైన ఉపన్యాసం, వర్క్ షాప్ కు గౌరవం లభించింది. జూన్ 4 న జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ముజ్తబా హుస్సేన్ తో సహా ఉర్దూ వినోదం, హాస్య సాహిత్యం పై చేసిన ప్రదర్శన విద్యావేత్తలు పీహెచ్డీ విద్యార్థులు, టెక్సాస్ ఉర్దూ సమాజా సభ్యులను ఆకట్టుకుంది. ప్రఖ్యాత కవయిత్రి ఇశ్రాత ఆప్రిన్ కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు. తన ఉపన్యాసంలో డా” గుల్-ఎ-రానా ముజ్తబా హుస్సేన్ యూసుఫ్ నజీం రచనలు, నజీర్ దాహ్కా నీ సులేమాన్ కతీబ్, సర్వార్ దండ కవితలను వివరించారు. ముజ్తబా హుస్సేన్ రచనలు ఒక ప్రాచీన నాగరికత ప్రపంచ సాహిత్య సందర్భం పై ఆమె అభిప్రాయాలు అందర్నీ ముగ్దులను చేశాయి. తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఏం.యాదగిరి ఆర్ట్స్ డిన్ కె. లావణ్య, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా .మామిడాల ప్రవీణ్, ఇతర ఫ్యాకల్టీ సభ్యులు డా” గుల్-ఎ-రానా విజయాన్ని అభినందించారు.
