24 C
Hyderabad
Sunday, August 2, 2026

కృపాల్ సింగ్ విద్యార్థులకు నైతిక విలువలలో తర్ఫీదు ఇచ్చారు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జియుపిఎస్ బర్కత్పురా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పిఆర్టియు తెలంగాణ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ విద్యార్థులకు నైతిక విలువలలో తర్ఫీదు ఇచ్చారని వివిధ ఉపాధ్యాయ సంఘ నేతలు మండల విద్యాధికారులు సి ఆర్ పి లు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు అన్నారు. ప్రధానోపాధ్యాయులు, పిఆర్టియు తెలంగాణ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనను వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నేతలు మాట్లాడుతూ కృపాల్ సింగ్ మూడు దశాబ్దాల పాటు విద్యారంగానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గం విద్యార్థినీ విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు నైతిక విలువలలో తర్ఫీదును ఇచ్చారన్నారు. క్రీడారంగంలోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి కావలసిన పుస్తకాలు, దుస్తులు, నోటుబుక్కులు అందించారని తెలిపారు.తనకు విద్యార్థుల పట్ల ఉన్న శ్రద్ధాసక్తులకు చిహ్నంగా నిలుస్తూ సమాజంలో ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు.

More articles

Latest article