26.2 C
Hyderabad

గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లీ,బతుకమ్మ: కమ్మర్ పల్లీ మండలంలోని చౌటుపల్లి గ్రామంలో గంజాయి రవాణా జరిగినట్లు తెలిసిన ఎవరైనా సేవించినట్టు తెలిసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగినది. ఇట్టి గంజాయి విషయంలో గ్రామ అభివృద్ధి కమిటీ తీవ్రంగా కఠినంగా వ్యవహరిస్తుందని వారికి తెలియజేయడం జరిగింది. సమావేశం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొమ్ముల రాజేందర్  గ్రామ  అభివృద్ధి కమిటీ సభ్యుల సమక్షంలో యువకులు దుకాణ సముదాయాల వారికి తెలియజేశారు.  యువకుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఇట్టి తీర్మానం చేయడం జరిగింది.

More articles

Latest article