24 C
Hyderabad
Sunday, August 2, 2026

జలాశయాలు ఆధునిక దేవాలయాలు

Must read

📰 Generate e-Paper Clip

  • నెహ్రూ చేసిన సేవలు మరువలేని

 

మెండోరా, బతుకమ్మ: స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిత్ జవహలాల్ నెహ్రూ జలాశయాలు ఆధునిక దేవాలయాలని అభివర్ణించి తాను చేసిన సేవలు మరువలేనివని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఈ ఈ గణేష్ అన్నారు. నెహ్రూ 61వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రాజెక్టుపై ఉన్న నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దక్షిణ భారత దేశంలో అతి పొడవైన గోదావరి నది ద్వార 1963 కు ముందు ప్రతి సంవత్సరం వాన కాలం, వరదల వల్ల వేల టి ఎం సి ల వర్షపు నీరు వృధా గా బంగాళా ఖాతం లో కలిసేవని ఈ నీటికి అడ్డు కట్ట వేసి ప్రాజెక్టు నిర్మించి ఆ నీటి తో ఉత్తర తెలంగాణ లోని లక్షల ఎకరాల బీడు భూమిని సాగు భూమి గా పచ్చని వ్యవసాయ తెలంగాణ గా మార్చాలనే సదుద్దేశంతో,ముందు చూపుతో 1963 లో నెహ్రూ  పోచంపాడ్ గ్రామం వద్ద శ్రీరాం సాగర్ జలాశయం నిర్మాణానికి పునాది రాయి వేయడంతో ఆయన నిర్మించిన ఈ ప్రాజెక్టు నేడు, సరస్వతి కాలువా,కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ మరియు ఇందిరమ్మ వరద కాలువ ల ద్వార ఉత్తర తెలంగాణ లో లక్షల ఎకరాల లో బంగారు పంటలు పండుతున్నాయని గుర్తు చేశారు. అలాగే పోచంపాడ్ లోని జలవిద్యుత్ కేంద్రం ద్వారా వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుచున్నదని తెలియజేశారు. ప్రతి ఎండా కాలంలో నిర్మల్, అదిలాబాద్, నిజమాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలకు సమృద్ధిగా త్రాగు నీరు అందించ బడు చున్నదని పేర్కొన్నారు. నెహ్రు అభివర్ణించిన విధముగా ఈ రోజు శ్రీరాం సాగర్ జలాశయం ఆధునిక దేవాలయం గా విరాజిల్లు తున్నదని అన్నారు. కార్యక్రమంలో డీ ఎస్ ఈ లాల్ సింగ్, సూపరిందేంట్లు, గోదావరి, రవిoధర్  ఎస్సారెస్పీ టీఎన్జీవోస్ అధ్యక్షులు ప్రవీణరాజ్, ఉపాధ్యక్షులు నరేందర్ గౌడ్, గారు, ప్రాజెక్టు ఏ ఈ ఈ శ్యామ్ సర్కిల్, డివిజన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article