మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి దేవేందర్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. గ్రామానికి చెందిన గజ్జెల రూప కు రూ. 29,500 చెక్కును అందించడం జరిగింది. లబ్ధిదారులు సహకరించిన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అనిల్, పిల్లి మహేష్, శ్యాముగౌడ్, నరేష్, రాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
