27.3 C
Hyderabad
Friday, July 31, 2026

కొనోకార్పస్ చెట్లు తొలగించాలని వినతి

Must read

బతుకమ్మ, బోధన్ : బోధన్ మున్సిపాలిటీ పరిధిలో సుందరీకరణ పనులలో భాగంగా డివైడర్‌ల మధ్య నాటిన కొనోకార్పస్ చెట్ల ప్రభావం పై స్థానిక బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి విషపూరితమైనవిగా పేర్కొంటూ, ప్రజలకు చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయని తెలిపారు. బీజేపీ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు పసులోటి గోపి కిషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోపి కిషన్, మాజీ అధ్యక్షులు కొలిపాక బాలరాజు మాట్లాడుతూ ఈ చెట్లపై పక్షులు గూడు పెట్టవు, జీవులు ఆకులను తినవు, క్రిమికీటకాలు కూడా దగ్గరకు రావు. పైగా భూగర్భ జలాల హానికరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గుజరాత్, కర్నాటక, అస్సాంల్లో ఈ మొక్కలు నిషేధించబడ్డాయని, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇదే సూచనలున్నాయని బీజేపీ పేర్కొంది. ప్రజల ఆరోగ్య దృష్ట్యా బోధన్‌లో కొనోకార్పస్ చెట్ల తొలగింపు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, పట్టణ మాజీ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, రాజుల దేవి పవన్ కుమార్, ఎనుగంటి గౌతమ్ గౌడ్, కందికట్ల వాసు, యోగి రాజు, చరణ్, భూమన్న, కిషోర్, బిల్లా విజయ్, లోకేష్, సాగర్, శ్రీకాంత్, అక్షయ్, సంతోష్, ప్రసాద్, విజయ్, నిమ్మ శీను, సోమేష్, శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

Request to remove Conocarpus trees

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article