కొనోకార్పస్ చెట్లు తొలగించాలని వినతి

బతుకమ్మ, బోధన్ : బోధన్ మున్సిపాలిటీ పరిధిలో సుందరీకరణ పనులలో భాగంగా డివైడర్‌ల మధ్య నాటిన కొనోకార్పస్ చెట్ల ప్రభావం పై స్థానిక బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి విషపూరితమైనవిగా పేర్కొంటూ, ప్రజలకు చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయని తెలిపారు. బీజేపీ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు పసులోటి గోపి కిషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోపి కిషన్, మాజీ అధ్యక్షులు కొలిపాక బాలరాజు...