నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఘన్ పూర్ శివారులోని 7.13 ప్రభుత్వ భూమికి కబ్జాల నుంచి కాపాడాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) డిచ్ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి సాయ గౌడ్ మాట్లాడుతూ గన్ పూర్ గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 349 లో సుమారు 7. 13 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నదని తెలిపారు. ఈ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాజకీయ నాయకుల అండతో సంబంధిత అధికారులకు లంచాలని ఏరా చూపి భూమిని అక్రమ పట్టా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తక్షణం ప్రభుత్వ యంత్రాంగం స్పందించి భూమిని కాపాడాలని అన్నారు. గన్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఇస్లాంపూర్ గన్ పూర్ గ్రామంలో నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లకు స్థలాన్ని కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి పేదలకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ డిచ్ పల్లి మండల కార్యదర్శి మురళి సాగర్, మోహన్, శారద, సంగీత, గంగాధర్, ముంతాజ్, జమున, సాయిలు, గంగారం తదితరులు పాల్గొన్నారు.