నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పవర్ ఎంప్లాయిస్ జెంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ నుండి జిపిఎఫ్ 1999 నుండి 2004 వరకు నియమాకమైన ఉద్యోగస్తులకు జిపిఎఫ్ వర్తింపచేయాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం పై స్పందిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు స్టాప్ ఉద్యోగులు, ఇంజనీర్లు బాగా పనిచేసి గత సంవత్సరం పంటలు పండడానికి మీరే కారణమని బాగా పనిచేస్తున్నారని విద్యుత్ ఉద్యోగులను అభినందించారు. మీరు ఇచ్చిన వినతిపత్రం నేను రాష్ట్రముఖ్యమంత్రి దృష్టికి, రాష్ట్ర శాసనసభలో ప్రస్తావిస్తానని ఏ విధంగా అయితే ప్రభుత్వంలో ఉద్యోగులకు 2004 వరకు జిపిఎఫ్ వర్కింగ్ చేస్తున్నారో మరి విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా 2004 వరకు జిపిఎఫ్ వర్తింప చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి విన్నవిస్తానని తెలిపారు. దీనికి నిజాంబాద్ జిల్లా జెయింట్ యాక్షన్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. కమిటీ కో కన్వీనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఎంప్లాయిస్ ప్రమాదవశాత్తు చనిపోతే కోటి రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈపీఎఫ్ టు జిపిఎఫ్ కూడా రాష్ట్రంలో ఉన్న 5000 మందికి ఉద్యోగస్తులకు వర్తించేటట్టు చేయవలసిందిగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో పవర్ ఎంప్లాయిస్ జేఏసీ రాజేందర్ గౌడ్ 1104 జిల్లా అధ్యక్షులు, కో కన్వీనర్ తోట రాజశేఖర్ ఈపీఎఫ్ టు జిపిఎఫ్ నాయకులు శ్రీనివాస్ శ్రీరామ్ మూర్తి, జేఏసీ నాయకులు రాజేందర్, చంద్రశేఖర్, శంకర్ నాయక్, సతీష్, హరికృష్ణ, బి శ్రీనివాసు, రాంగోపాల్, మంది విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
