నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును శనివారం బాపూజీ వచనాలయ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసిసి పుష్పగుచ్చమిచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా బాపూజీ వచనాలయ కమిటీ అధ్యక్షులు గడ్డం భక్తవత్సలం మాట్లాడుతూ బాపూజీ వచనాలయాన్ని సందర్శించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కోరామని తెలిపారు. తెలంగాణలోని అతిపెద్ద డిజిటల్ లైబ్రరీగా బాపూజీ వచనాలయాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా బాపూజీ వచనాలయం వేదికగా నిలబడుతుందన్నారు. ఈ సందర్బంగా ఉర్దూ అకాడమి చేర్మెన్ తాహేర్ బిన్ హందన్ మాట్లాడుతూ ఉన్నత చదువుల కోసం ఎన్నో సంవత్సరాలగా ఈ లైబ్రరీ తోడ్పాటు అందించిందని అన్నారు. విద్యార్థుల కోసం వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల బుక్స్ ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే బాపూజీ వచనలయాన్ని సందర్శిస్తానని తెలిపారని అన్నారు. నూతన కమిటీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, ఉపాధ్యక్షులు బీడి.దాస్, సంయుక్త కార్యదర్శి ఏఎస్. సాంబయ్య, సభ్యులు ప్రతాప్ రుద్ర, కోవూరు జగన్,ఆమందు విజయ్, అరేట్టి లక్ష్మి నారాయణ, పాటి అనిల్ రెడ్డి, గోవింద్ ప్రసాద్ జవర్, తదితరులు పాల్గొన్నారు.
