జిల్లా కలెక్టర్ ను కలిసిన బాపూజీ వచనాలయ ప్రతినిధులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును శనివారం బాపూజీ వచనాలయ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసిసి పుష్పగుచ్చమిచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా బాపూజీ వచనాలయ కమిటీ అధ్యక్షులు గడ్డం భక్తవత్సలం మాట్లాడుతూ బాపూజీ వచనాలయాన్ని సందర్శించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కోరామని తెలిపారు. తెలంగాణలోని అతిపెద్ద డిజిటల్ లైబ్రరీగా బాపూజీ వచనాలయాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా బాపూజీ వచనాలయం వేదికగా నిలబడుతుందన్నారు. ఈ సందర్బంగా ఉర్దూ అకాడమి చేర్మెన్ తాహేర్ బిన్ హందన్ మాట్లాడుతూ...