భవిష్యత్తులో అంతర్జాతీయ పోటిల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలి

0 9,710

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మాలవత్ మమత వంటి క్రీడాకారిణులు జిల్లాకు గర్వకారణమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని నగర పోలీస్ కమిషనర్ కోరారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతిభావంతురాలు, జాతీయ స్థాయిలో ఐదుసార్లు హాకీ క్రీడల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన మాలవత్ మమతను మంగళవారం సీపీ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం , నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో ఐదుసార్లు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గొప్ప విషయమని ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, ధర్పల్లి సి. ఐ బి.భిక్షపతి,  సిరికొండ ఎస్.ఐ జె.రామకృష్ణ, నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ విశాఖ గంగారెడ్డి, సెక్రటరీ రమణ, హాకీ కోచ్ నగేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.