26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రేణుకా ఎల్లమ్మ దేవి మాత మందిర పునర్నిర్మాణానికి కృషి చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

  • రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మాన్ పల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దేవాలయం గత 60 సంవత్సరాల క్రితం నిర్మించింది కావడంతో శిథిలవస్తా పరిస్థితుల్లో ఉన్నందున స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి మాత మందిరం వద్దకు చేరుకొని పునర్నిర్మాణానికి పూజలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా, ఎమ్మెల్యే నిధుల నుండి గుడి పునర్నిర్మాణానికి నిధులు దశలవారీగా మంజూరు చేసేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గుడి ముందర ఉన్న కాల్వను సిసి ద్వారా మరమ్మత్తులు చేయాలని కోరగా సీడిపి పండు నుండి లేదా,ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి కానీ నిధులు మంజూరు చేసి అట్టి కాల్వపనులను సీసీతో పూర్తి చేయించేలా కృషి చేస్తానని తెలిపారు.గౌడ కులస్తులు ఐక్యమైత్యంతో గుడి పునర్నిర్మాణం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి మాత వద్ద వారం వారంలో రెండు మూడు రోజులు పండగ వాతావరణం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఎల్లమ్మ తల్లికి పండగలు నిర్వహించడంతో భక్తుల రద్దీ క్రమం క్రమం పెరుగుతూ వస్తుందని తెలిపారు. దీంతో భక్తులు ఎల్లమ్మ దేవి వద్ద పండగను జరుపుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఎమ్మెల్యేకు వివరించారు.దీంతో గౌడ నాయకులను,కులాస్తులను మహిళలను అభినందించారు. గుడి శిథిలవస్థకు చేరుకోవడం భక్తులకు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారడంతో గౌడ సంఘం నాయకులు కులాస్తులు మహిళలు ఏకమై శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి మాత మందిరాన్ని పునర్నిర్మాణం చేయాలని పట్టుదలతో మహిళలు ప్రతినెల పది పది రూపాయల చొప్పున పోగుచేసి ఆలయ పునర్నిర్మానాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ఆలయ నిర్మాణం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ చింతల కిషన్,మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి,తిర్మాన్ పల్లి గౌడ సంఘం అధ్యక్షులు రాజనర్సగౌడ్,పడాల శంకర్ గౌడ్,ఏజీ గౌడ్,శ్రీనివాస్ గౌడ్. పెద్ద గంగ గౌడ్,చిన్న గంగా గౌడ్,లింగా గౌడ్,నారా గౌడ్, అంజా గౌడ్. నరేష్ గౌడ్. ఎస్ ప్రవీణ్ గౌడ్,జంగిలి లక్ష్మి, ఇందల్వాయి మాజీ సర్పంచ్ ఆరిపల్లి దశరథ్,బాదావత్ వసంత్ రావు,మండల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Renuka will work towards the reconstruction of Yellamma Devi Mata Mandir

More articles

Latest article