27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వాటర్ ట్యాంకుల తొలగింపు

Must read

📰 Generate e-Paper Clip

  • ఇసుక ర్యాంపు కోసం తరలింపు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
  • ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన సెక్రటరీ

Removal of water tanks

బతుకమ్మ, కోటగిరి :  ఇసుక  రవాణా కోసం  ఏకంగా పబ్లిక్ మినీ వాటర్ ట్యాంకులనే తొలగించిన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామంలో ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరు మంజీరా నది నుంచి ఇసుక తరలించేందుకు అనుగుణంగా ఇసుక ర్యాంపును సులువుతరం  చేసేందుకు గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబిల ద్వారా గ్రామంలోని మినీ వాటర్ ట్యాంక్లను తొలగించి తరలించడం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం విషయం తెలిసిన గ్రామపంచాయతీ కార్యదర్శి అక్రమంగా మినీ వాటర్ ట్యాంకులను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీవో చందర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Removal of water tanks

  •  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం:ఎంపీడీవో చందర్

అక్రమంగా నాలుగు వాటర్ మినీ వాటర్ ట్యాంకులను తొలగించిన విషయం తమ వద్దకు వచ్చిందని, అనుమతులు లేకుండా గ్రామపంచాయతీ ఆస్తులను అక్రమంగా తొలగించిన వారిపై  కట్నమైన చర్యలు తీసుకుంటాం.

Removal of water tanks

More articles

Latest article