… రోడ్డు ఫైకి వచ్చిన దుకాణలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు
ఇందూర్, బతుకమ్మ :
నగరంలోని హైమదీబజార్ లో వ్యాపారస్తులు రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు అక్రమలను తొలగించారు. హైమదీబజార్ మటన్, చికెన్, ఫిష్ మార్కెట్ లతో పాటు కూరగాయలు విక్రయాలు జరపడంతో టాపిక్ కు తీవ్ర ఏర్పడుతుంది. ప్రతిరోజు పెద్ద ఎత్తున మార్కెట్ నిర్వహిస్తుండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గురువారం ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ,ట్రాఫిక్ సిఐ పబ్బ ప్రసాద్ ఆధ్వర్యంలో దుకాణాల ఎదుట ఉన్న ఆక్రమాలను తొలగించారు. దుకాణదారులు రోడ్డుపైకి వచ్చి వ్యాపారం నిర్వహించరాదని సూచించారు. ఇరువైపుల రోడ్ల ను ఆక్రమించిన దుకాణాలను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

