27.8 C
Hyderabad

ఓపెన్ హార్ట్ సర్జరీతో గుండెలో కణితి తొలగింపు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గుండె శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ రాకేష్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గుండెలో ఏర్పడిన కణితి కారణంగా రక్తసరఫరాకు ఏర్పడిన తీవ్ర ఆటంకాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా విజయవంతంగా తొలగించినట్లు మెడికవర్ హాస్పిటల్స్ గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న మెడికవర్ హాస్పిటల్స్‌ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 40 ఏళ్ల వయసున్న మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్ల వాపులతో ఆస్పత్రికి వచ్చినట్లు డాక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించగా గుండెలో కణితి ఏర్పడి రక్తసరఫరాకు ఆటంకం కలుగుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. రోగి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించి, రక్తసరఫరాకు అడ్డుగా ఉన్న కణితిని విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం మహిళ కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలాంటి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గుండెలో ఏర్పడే ప్రతి కణితి క్యాన్సర్‌కు సంబంధించినది కాదని డాక్టర్ రాకేష్ కుమార్ స్పష్టం చేశారు. క్యాన్సర్‌కు సంబంధించిన కణితులు, ఇతర కారణాలతో ఏర్పడే కణితుల లక్షణాల్లో తేడాలు ఉంటాయని తెలిపారు. క్షయవ్యాధి వంటి ఇతర కారణాల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో కణితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. నిపుణులైన వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకుని, సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ ఏలేటి వను మాట్లాడుతూ గుండెలో కణితి కారణంగా రక్తసరఫరాకు ఆటంకం ఏర్పడటం అరుదైన, సవాలుతో కూడుకున్న పరిస్థితి అని తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి, సరైన సమయంలో శస్త్రచికిత్స చేయడం ద్వారా రోగికి మంచి ఫలితం అందించగలిగామని చెప్పారు. మెడికవర్ హాస్పిటల్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కూరపాటి యజ్ఞ మాట్లాడుతూ ఇలాంటి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను నిజామాబాద్‌లో విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ స్వామి, డీఎంఎస్ యజ్ఞ, వినయ్ కుమార్, మార్కెటింగ్ హెడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article