డిల్లీ, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్ల ను ప్రభుత్వం 42 శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నం. 9ని సవాలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగా గోపాల్ రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఈపిటిషన్ పై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మోహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓవైపు హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. . తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టు కు తెలుపగా.. అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడ కు వస్తారా.. అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈకేసులో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని సూచిస్తూ.. వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ ను ధర్మాసనం డిస్మస్ చేసింది.
