30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఐఐఐటీ విద్యార్థినికి రెడ్ క్రాస్ ఆర్థిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

 

బీబీపేట, బతుకమ్మ :

 

బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని వడ్ల నక్షత్ర బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశం సాధించింది. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో చదువు కొనసాగించేందుకు సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిస్ సాంగ్వ్యాన్‌ను ఆమె కోరింది. విద్యార్థిని పరిస్థితిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ స్పందించి, రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నక్షత్రకు సహాయం అందించి, ఆమె ఉన్నత విద్యను విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎన్.వై. గిరి, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఎం. రాజన్న, అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article