కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు గురువారం రెడ్ క్రాస్ సోసైటీ సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. మే 15 నుండి జూన్ 15 వరకు స్పెషల్ డ్రైవ్ మెంబర్ షిప్ లో భాగంగా స్థానిక ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఆర్కిడ్స్ విద్యాసంస్థల్లో కళాశాల సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి పాట్రన్ మెంబర్ గా సభ్యత్వ నమోదు ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గిరి, నోడల్ ఆఫీసర్ శశి కుమార్, డా.ఎం.జైపాల్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 100 మందికి పైగా సభ్యత్వ నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు.

ఇలాగే ఎక్కువ మంది రెడ్ క్రాస్ లో జాయిన్ అయ్యి కామారెడ్డి జిల్లాకు సేవ చేసే అద్భుత అవకాశాన్ని కల్పించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్, గోవర్ధన్ రెడ్డి, దత్తాత్రి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

