- పేదలు సుభిక్షంగా ఉండాలని సన్నబియ్యం ఇచ్చాం
- నల్గొండ చరిత్రనే తెలంగాణ చరిత్ర
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తిరుమలగిరి, బతుకమ్మ : రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవమని, ఇందిరమ్మ రాజ్యం లో పేదలు సుభిక్షంగా ఉండాలని సన్నబియ్యం ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలోని తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘తుంగతుర్తి గడ్డ కు గొప్ప చరిత్ర ఉంది. సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ నల్గొండ, తుంగతుర్తి. నల్గొండ చరిత్రనే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు. నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టు ,మూసీ ప్రాజెక్టు కట్టి నల్గొండ రైతులకు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఉంటే గోదావరి జలాలు మూడు రోజులలో తీసుకు వస్తానని ఒకరు అంటున్నారు. గ్లాస్ లో సోడా కాదు గోదావరి జలాలు తీసుకురావడానికి. 10 ఏళ్లు అధికారం లో ఉన్నపుడు ఎందుకు గోదావరి నీళ్లు తీసుకురాలేదు? సొంత మండలానికి ఎంఆర్ ఓ ఆఫీస్ తీసుకురాని సన్నాసి మమల్ని అంటావా?. 10 ఏళ్ళు అధికారం లో ఉన్న బీఆర్ ఎస్ వాళ్లకు రేషన్ కార్డు లు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు. పేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన రాలేదు. మా ప్రభుత్వం మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నది. బీఆర్ఎస్ హయాం లో గ్రామాల్లో బెల్టుషాప్ లు ఉంటే మా ప్రభుత్వం లో సన్నబియ్యం కోసం జనం బారులు తీరుతున్నారు. మా ప్రభుత్వం పైన కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. రైతులకు500 రూపాయల బోనస్, సన్నబియ్యం,రైతు భరోసా,రైతు రుణ మాఫీ లాంటి పథకాలు ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యం. 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేసి రుణ విముక్తి కల్పించాం. రైతు భరోసా ఇవ్వమని బీఆర్ ఎస్ ప్రచారం చేసింది. కానీ 9 రోజులలోనే 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి వాళ్లలో సంతోషం నింపాం. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేశాం. 2.85 లక్షల ధ్యానం పండించి దేశం లోనే నెంబర్ 1 గా నిలిచాం. రైతులు సంతోషంగా ఉంటేనే ఇందిరమ్మ ఆత్మ సంతోషం గా ఉంటుంది..సోనియమ్మ కల నెరవేరుతుంది. కొత్త గా 5.6 లక్షల మంది కి రేషన్ కార్డులు మంజూరు చేశాం. 26 లక్షల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులలో నమోదు చేశాం. 3.10 కోట్లమంది కి సన్నబియ్యం పంపిణీ చేశాం. 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 2 చీరలు పంపిణీ చేయబోతున్నాం. స్వయం సహాయక సంఘాల గ్రూప్ లకు 21 వేల కోట్ల రుణాలను బ్యాంకు ల ద్వారా అందిస్తున్నాం. ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నాం..ఇందుకోసం 6500 కోట్ల రూపాయల ఖర్చు చేశాం. మహిళా సంఘాల లకు బస్ లు కొనిస్తున్నాం. పెట్రోల్ బంక్ లు ఏర్పాటు చేస్తున్నాం. సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయించి 1000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కి ఒప్పందం చేసుకుంటున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ప్రభుత్వ స్కూల్స్ బాగు చేయించాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశం లోనే రికార్డ్ సృష్టించాం. 2 ఏళ్ల లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కేసీఆర్ లక్ష కోట్ల తో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయింది. 60 ఏళ్ల లో కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్,శ్రీశైలం,ఎస్ ఆర్ ఎస్ పీ,జూరాల లాంటి ప్రాజెక్ట్ లు ఎలా ఉన్నాయి? కాళేశ్వరం ఎలా ఉందో చర్చకు సిద్ధమా? మిమ్మల్నిని ఊరి తీసినా పాపం లేదు. తెలంగాణ ధనాన్ని దోచుకున్నారు. తుంగతుర్తి కి గోదావరి జలాలు తీసుకువచ్చి తీరుతాం. నల్గొండ జిల్లాలో ఒక గంజాయి మొక్క ఉంది..వచ్చే ఎన్నికల్లో పీకేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల్ని గెలిపించే బాధ్యత మాది. తోరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గొప్ప మెజారిటీ తో పార్టీ ని గెలిపియించాలి. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారం లో ఉంటుంది. తెలంగాణ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. తెలంగాణ ను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా తీర్చిదిదుతాం. దేశం లోనే మొదటగా తెలంగాణ ఎస్సీ వర్గీకరణ చేసింది. 100 సంవత్సరాల తర్వాత తెలంగాణ లో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచాం. మోదీ మెడలు వంచి జనగణన లో కులగణన చేపట్టేలా చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కలిపిస్తున్నాం. బీసీ లకు రాజ్యాధికారం కల్పించేలా కృషి చేస్తున్నాం’’ అని అన్నారు.