రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం

పేదలు సుభిక్షంగా ఉండాలని సన్నబియ్యం ఇచ్చాం నల్గొండ చరిత్రనే తెలంగాణ చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   తిరుమలగిరి, బతుకమ్మ : రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవమని, ఇందిరమ్మ రాజ్యం లో పేదలు సుభిక్షంగా ఉండాలని సన్నబియ్యం ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలోని తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘తుంగతుర్తి గడ్డ కు గొప్ప చరిత్ర ఉంది. సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ నల్గొండ, తుంగతుర్తి....