29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

‘మెడికవర్’లో అరుదైన కీ హోల్ వాస్కులర్ చికిత్స

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ఇద్దరికి అరుదైన కీ హోల్ వాస్కులర్ చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం కాలూర్ గ్రామానికి చెందిన 53 ఏళ్ల అంజయ్య, ఇందల్వాయి మండలం అన్సాన్ పల్లికి చెందిన 50ఏళ్ల మల్లయ్య వేర్వేరు రోజుల్లో కాళ్లలో తీవ్రమైన నొప్పి, మానని పుండ్లు, కొద్ది దూరం కూడా నడవలేని పరిస్థితుల్లో మెడికవర్ ఆస్పత్రికి వచ్చారు.
వారిని పరీక్షించిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రవి కిరణ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫేరిపెరల్ యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా కాళ్ల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినట్లు నిర్దారించి స్టంట్ వేసి రక్తప్రసరణను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అంజయ్య, మల్లయ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కిరణ్ మాట్లాడుతూ.. ఇటువంటి ఫెరిఫరల్ ఇంటర్వెన్షన్ చికిత్స ఎటువంటి కోత లేకుండా చిన్న రంధ్రం ద్వారా చేయటం నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారి మెడికవర్ హాస్పిటల్ జరిగిందని, ఎటువంటి కుట్టు, కోత లేకుండా నిర్వహించామని తెలిపారు. ఇటువంటి వ్యాధులు సాధారణంగా ధూమపానం చేయడం రావొచ్చని పేర్కొన్నారు.
సెంటర్ హెడ్ స్వామి మాట్లాడుతూ.. ఇటువంటి అరుదైన సర్జరీలు చేసే సౌకర్యాలు మెడికవర్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే హైదరాబాద్ కు వెళ్లకుండా తక్కువ ఖర్చుతో నిజామాబాదులోనే చికిత్స పొందవచ్చన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్డీఎంఎస్ డాక్టర్ యజ్ఞ పాల్గొన్నారు.


Rare Key Hole Vascular Treatment in ‘Medicover’

More articles

Latest article