31.2 C
Hyderabad

ఎత్తొండ సొసైటీకి తాళం

Must read

📰 Generate e-Paper Clip

. గన్నీ సంచులు ఇవ్వడం లేదని రైతుల ధర్నా
కోటగిరి, బతుకమ్మ: గన్నీ సంచులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు కోటగిరి మండలం ఎత్తొండ సహకార సొసైటీకి తాళం వేశారు. గన్సీ సంచుల కొరతతోపాటు హమాలీల కొరత కారణంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ధాన్యం కాటా చేస్తున్నారని, చిన్న రైతులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. వెంటనే గన్నీ సంచులు సమకూర్చడంతోపాటుహమాలీల కొరత లేకుండా సరైన పద్ధతిలో ధాన్యం కాటా చేయాలని డిమాండ్ చేశారు.

Lockdown for Ettonda Society

More articles

Latest article