- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
రుద్రూర్(వర్ని), బతుకమ్మ : 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఏడు నెలల గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్ని ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలంలోని ఓ గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి సదరు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
