- వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
భీమ్‌గల్, బతుకమ్మ : పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని భీమ్‌గల్, పట్టణం తోపాటు మండలంలోని బాబా పూర్, పల్లికొండ, బడా భీమ్‌గల్, సికింద్రాబాద్, గోనుగోపులతో పాటు వివిధ గ్రామాలలో రంజాన్ వేడుకులను ముస్లీంలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఈద్గాల వద్ద సోమవారం ముస్లిమ్ సోదరులు,మత పెద్దల సమక్షంలో ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.గత నెలరోజులుగా కొనసాగిన కటోర ఉపవాస దీక్షలు నిన్నటి తో పూర్తి అవ్వడం తోపండగ సందర్భంగా ముస్లిం చిన్న, పెద్దలు నూతన దుస్తులను ధరించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల లో గల ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా భీమ్‌గల్, బాబాపూర్, గ్రామాల ఈద్గా వద్ద అంజుమన్,మదర్సా, కమిటీ, అధ్యక్షులు, అంజు అలీ, ఫహీం, అతిక్, మాట్లాడుతూ…దేవుడి దయ వల్ల పట్టణ, గ్రామీణ ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని, గ్రామంలోని ప్రజలు మతసామరస్యానికి ప్రతీకగా వుంటూ సోదర భావం తో మెదగాలని అన్నారు.గత నెలరోజులుగా కొనసాగిన ఉపవాస దీక్షలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల
రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి,బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డినియోజకవర్గం లో అంతటా రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.ఇందులో భాగంగా ఆయన భీమ్‌గల్, బాబాపూర్, ఈద్గాల వద్ద ముస్లింలకు ప్రశాంత్ రెడ్డి కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బాబాపూర్ లో మాజీ జడ్పి కోప్షన్ మెంబర్ మోహిజ్ ఏర్పాటు చేసిన రంజాన్ విందులో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని మసీదుల మత గురువులు, అంజుమన్ మదర్స కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

