25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మాలపల్లి లో వేట కొడవలితో యువకుడి హల్చల్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో రంజాన్ పండుగ వరకు శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసులు అహర్నిశలు కష్టపడ్డారు. ప్రధానంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య నగరంలో పండుగలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చేసిన సేవలు అమోఘం.  పండగ రోజు సోమవారం సాయంత్రం మాలపల్లి లో ఒక యువకుడు వేట కొడవలితో హల్చల్ చేశాడు. తనను ఒక వ్యక్తి వేధిస్తుండడంతో బెదిరించేందుకు కత్తిని తీసుకొని సోమవారం సాయంత్రం మాలపల్లి రహదారిలో వేచి ఉన్నాడు. బైక్ పై వచ్చిన వేధింపులకు పాల్పడిన యువకుడిని ఉద్దేశించి మరో యువకుడు గొడవ పడేందుకు యత్నించాడు.  అయితే కొందరు వారించడంతో అక్కడ ఎలాంటి గొడవ జరగలేదు. అదే సమయంలో కొందరు సంబంధిత కత్తులకు సంబంధించిన వీడియో ను తీసి సోషల్ మీడియాలో వదలడంతో హల్చల్ చేస్తుంది. ఈ విషయంపై నగర వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతిని వివరణ కోరగా…. ఫిర్యాదు స్వీకరిస్తున్నామని తెలిపారు… విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

A young man was seen running around with a hunting axe in Malapalli.

More articles

Latest article