చక్రేశ్వర శివాలయ ఈవోగా రాములు బాధ్యతల స్వీకరణ

0 1,655

 బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివ మందిర కార్యనిర్వాహణ అధికారిగా రాములు సోమవారం బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, చైర్మన్,  పట్టణ ప్రముఖులు పూల గుచ్చం అందించి స్వాగతం పలికారు. గతంలో రాములు జేఏఓ గా విధులు నిర్వహించి పదోన్నతితో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివాలయ, మారుతి మందిర ఆలయ కమిటీల చైర్మన్ లు హరికాంత్ చారి, శంకర్, పాలక కమిటీ సభ్యులు, అర్చకులు గణేష్ మహరాజ్, మహేష్ పాఠక్, ఆలయ మాజీ చైర్మన్ బీర్కూర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Ramulu assumes charge as the CEO of Chakrasvara Shiva Temple

Leave A Reply

Your email address will not be published.