రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి 76 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్, అడప సాయిలు, పత్తి లక్ష్మణ్, అక్కపల్లి నాగేందర్, నెరుగంటి బాలరాజు, పత్తి రాము, తోట సంగయ్య, సుదర్శన్ గౌడ్, అనీల్ పటేల్, సంజీవ్, షేక్ ఖాదర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.