నిజామాబాద్ క్రైం,బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభింనందించారు. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన ఏడుగురు కానిస్టేబుళ్లు గురువారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో రుద్రూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన కె.గంగాప్రసాద్, మోపాల్ పోలీస్ స్టేషన్ కు చెందిన కె.ఉషా శేఖర్, నగరంలోని రెండో టౌన్ కు చెందిన ఎ.భూంరాజ్, ఎన్.శ్రీనివాస్, పోలీస్ కంట్రోల్ రూంకు చెందిన కె.క్రిష్ణా, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన సయ్యద్ అప్జల్, సీసీఎస్ కు చెందిన జె.కెర్బాజీ ఉన్నారు.

