ముప్కాల్, బతుకమ్మ: పర్యావరణాన్ని పరిరక్షించడానికి పాఠశాల ఆవరణంలో ఉన్న వృక్షాలకు విద్యార్థులు రాఖీలను కట్టి విద్యార్థుల ప్రేమను చాటుకున్నారని ముప్కాల్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. రెంజార్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రక్షాబంధన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు సొంతంగా రాఖీలు తయారు చేసిన రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాలలో విద్యార్థులు రాఖీలు కట్టుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
