29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఖాజాపూర్ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

సాలుర, బతుకమ్మ: మండలంలోని ఖాజాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రక్షాబంధన్ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు ప్రతి స్త్రీలో సోదరిని చూసే విశాల దృష్టిని తెలిపే రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవాలని, తన సోదరుని శ్రేయస్సు కొరకు ప్రతి సోదరి రాఖీలు కడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకుంటూ నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనమిద్దరము దేశానికి రక్ష అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభ, ఉపాధ్యాయులు, పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ సాయిలు, హన్మండ్లు పాల్గొన్నారు.

Raksha Bandhan celebrations at Khajapur school

More articles

Latest article