ఖాజాపూర్ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు

సాలుర, బతుకమ్మ: మండలంలోని ఖాజాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రక్షాబంధన్ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు ప్రతి స్త్రీలో సోదరిని చూసే విశాల దృష్టిని తెలిపే రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవాలని, తన సోదరుని శ్రేయస్సు కొరకు ప్రతి సోదరి రాఖీలు కడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకుంటూ నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనమిద్దరము దేశానికి...