26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అమిత్ షా కేంద్రమంత్రి కావడానికి రాజ్యంగమే కారణం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి, బతుకమ్మ : అమిత్ షా కేంద్రమంత్రి కావడానికి రాజ్యంగమే కారణమని, అది రచించిన డా.బి.ఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లిమెంట్ లో రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ మంగళవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలన్నారు.  బీజేపీ మత రాజకీయాలు తప్ప అభివృద్ధి పైన ఎప్పుడు కూడా దృష్టి పెట్టదన్నారు. అంబేద్కర్ ను అవమానిస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోధన్నారు.  దేశానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప వారిపై అనుచిత వాక్యాలు చేయడం సరికాదన్నారు.  హోం మంత్రి స్వయంగా పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు నావి కావు ఎడిట్ చేసారు అనడం హాస్యాస్పదం అన్నారు. క్షమాపణ చెప్పకుంటే ఈ నిరసనలు మరింత తీవ్రతరం అవుతాయి అని హెచ్చరించారు.

Rajyangam is the reason why Amit Shah became Union Minister

More articles

Latest article