27.5 C
Hyderabad
Friday, July 31, 2026

రెవెన్యూ వ్యవస్థ పునర్వైభవానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

Must read

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ తహసీల్దార్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాములు

 ఎల్లారెడ్డి , బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం రెవిన్యూ వ్యవస్థను పునరుద్ధరణకు సిద్ధమైన వేళ మన నిబద్ధతను నిరూపించుకోవడానికి రెవెన్యూ వ్యవస్థపుర్వ వైభవంలో భాగస్వాములు కావడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలంగాణ తహసీల్ధార్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాములు పిలుపు నిచ్చారు. తెలంగాణ రెవిన్యూ సర్విస్ అసోసియేషన్  కామారెడ్డి జిల్లా అత్మీయ సమ్మెళనం మంగళవారం ఎల్లారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిజిటిఏ అధ్యక్షులు రాములు మాట్లాడుతు..గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థను విధ్వంసపూరిత విధానాలతో ఎలా ధ్వంసం చేశారో అందరికి తెలుసన్నారు. మనం ఎదుర్కొన్న అవమానాలు, మన తోటి ఉద్యోగ సోదరులను రాత్రికిరాత్రి డిపార్ట్మెంట్ నుండి బలవంతంగా పంపించిన దృశ్యాలు మనందరికీ విధితమే అని గుర్తు చేసుకున్నారు.  ఈ రోజు కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం చేసుకునే గొప్ప అవకాశం మనకు లభించిందని దానికి అందరు కలిసికట్టుగా పని చేయాలని అన్నారు.  కామారెడ్డి తెలంగాణ రెవిన్యూ సర్వేసెస్ అసోసియేషన్ అధ్యక్షులుగా కాపర్తి సంగమేశ్వర్  కామారెడ్డి జిల్లా తెలంగాణ రెవిన్యూ సర్వేసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా కాపర్తి సంగమేశ్వర్ (లింగం పేట్ .డిటీ), ప్రధాన కార్యదర్శిగా కే. అశోక్ (బాన్సువాడ ఆర్ఐ), ఉపాధ్యక్షులుగా రామాదాస్, రవి, కే. నర్సింలు, కార్యనిర్వహక కార్యదర్శులుగా స్వామీ, రవి కుమార్, సంజీవ్, లింగం, అసోసియేట్ ప్రెసిడేంట్ లు లింగాపూర్ రాజు, గంగాప్రసాద్ లను, సంయుక్త కార్యదర్శులుగా కే. రాజేశ్వర్, జి సరిత. ద్యావతి ఆశోక్, భాస్కర్, మిడియా కార్యాదర్శి మురళి పటేల్, కోశాధికారిగా కే, చెన్నారెడ్డి (తాడ్వాయి జేఏ), మహిళ అధ్యక్షురాలు  సంతోషీ ( రాజం పేట్ డిటి), సాయి ప్రియ ( నస్రుల్లాబాద్ ధరణి ఆపరేటర్),  కార్యవర్గ సభ్యులుగా సరిత, అన్నపూర్ణ, కుషాల్, మచ్చేంధర్ లను ఎన్నుకున్నారు.

Everyone should come forward for the revitalization of the revenue system

More articles

Latest article