- ఎంపీడీఓ సంతోష్ కుమార్
భీమ్ గల్, బతుకమ్మ : నిరుద్యోగ నిర్ములనకు గాను రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో యువతను కోరారు. స్వయం ఉపాధి కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీ సీ, ఈడబ్ల్యూబీసీ లకు ఆయా ఆయా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో లబ్ది పొందెందుకు మీ సేవా ద్వారా అప్లై చేసుకోవాలని కోరారు. అప్లై చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫారం తో పాటు ఆధార్ కార్డు,రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను మండల అభివృద్ధి అధికారి కార్యాలయం లో అందజేయాలనీ ఆయన కోరారు.లబ్దిదారుల అనుమానాల నివృత్తికై కార్యాలయం లో ప్రజా పాలన సేవా కేంద్రం ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ తెలిపారు.
