రాజన్న కోడెలు మరణిస్తున్నా పట్టించుకోవడం లేదు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందల్వాయి, బతుకమ్మ : వేములవాడలో రోజుకొక రాజన్న కోడె మరణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందల్వాయి రామాలయాన్ని సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆలయాల ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న కోడెల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ...