30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు : బీజేపీ నేతలు 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ:  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గు చేటని జిల్లా బీజేపీ నేతలు అన్నారు. వెంటనే రాహుల్ తన వ్యాఖ్యలను   ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా బీజేపీ  జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ  భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికలు సరిగ్గా జరగలేదని అమెరికాలో రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టను దెబ్బతీశారని  విమర్శించారు. భారతీయ సంస్కృతిలో స్త్రీని గృహలక్ష్మిగా, మాతృదేవతగా  పూజిస్తారన్నారు. రాహుల్ గాంధీ మహిళల గౌరవాన్ని కించపరచడంపై  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనంతరం జిల్లా బీజేపీ  ఆధ్వర్యంలో ఆదివారం రైల్వే స్టేషన్, శివాజీ చౌక్   వద్ద నేతలు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను  దహనం చేశారు.  ఈ కార్యక్రమంలో  బీజేపీ నాయకులు న్యాలం రాజు, మండల అధ్యక్షులు, గడ్డం రాజు, ఇప్పకాయల కిషోర్, నాగరాజు, తారక్ వేణు, ఆనంద్ రావు,తాజా మాజీ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, బీజేపీ నాయకులు విరేందర్, మఠం పవన్, బట్టి కిరి ఆనంద్, పవన్ ముందడ హరీష్ రెడ్డి, భాస్కర్, కిరణ్ కస్తూరి కృష్ణ, టీంకుల్ గౌడ్,బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Rahul Gandhi's comments are shameful: BJP leaders

 

More articles

Latest article