రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు : బీజేపీ నేతలు
నిజామాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గు చేటని జిల్లా బీజేపీ నేతలు అన్నారు. వెంటనే రాహుల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికలు సరిగ్గా జరగలేదని అమెరికాలో రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు. భారతీయ సంస్కృతిలో స్త్రీని గృహలక్ష్మిగా, మాతృదేవతగా పూజిస్తారన్నారు. రాహుల్ గాంధీ మహిళల గౌరవాన్ని కించపరచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా...