27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఆచన్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం

Must read

📰 Generate e-Paper Clip

 బోధన్, బతుకమ్మ :   సాలూర మండలంలోని ఆచన్‌పల్లి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ శాఖ ఆధ్వర్యంలో వరద ప్రభావిత గ్రామాలకు సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  భారీ వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన బోధన్, సాలూర పరిసర గ్రామాలైన మందర్నా, హున్సా, ఖాజాపూర్‌లలో క్లబ్ సభ్యులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో కూడిన 100 ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఇంటర్నేషనల్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ బసవేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లబ్ సభ్యులు మాట్లాడుతూ విపత్తు సమయంలో ప్రజలకు అండగా ఉండటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సహాయం వరద బాధితులకు కొంత ఉపశమనం కలిగిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Help for flood victims under the auspices of Achanpally Lions Club

More articles

Latest article