ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు,లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై, రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యువతకు ప్రేరణగా నిలిచారని తెలిపారు. దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఆయన సొంతమన్నారు. సమానత్వం, ధైర్యం, ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. ఈ వేడుకలో పార్టీ నాయకులు, యువజన విభాగం సభ్యులు, మహిళా నాయకులు, స్థానిక నాయకత్వం, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
