ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు,లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై, రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యువతకు ప్రేరణగా నిలిచారని తెలిపారు. దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఆయన సొంతమన్నారు....