29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో రాహుల్ గాంధీ భేటీ

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం సమావేశమయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై గౌడ్ వివరించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. పార్టీ ఆర్గనైజేషన్ పరంగా జరుగుతున్న కార్యక్రమాలను కూడా టీపీసీసీ అధ్యక్షుడు స్పష్టంగా వివరించారు. ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బీఎల్ఏ నియామకాలు, అనుబంధ సంఘాల ఏర్పాటు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అదేవిధంగా, రాష్ట్రంలో కుల ఘనన నిర్వహించి సమగ్ర అధికారిక సమాచారాన్ని ప్రకటించిన విషయాన్ని గౌడ్, రాహుల్ గాంధీకి తెలియజేశారు. దేశంలో ప్రతిపాదిత మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేషన్లను కూడా చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని గౌడ్ కోరగా, దీనిపై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ముందు మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ కూడా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

More articles

Latest article