టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో రాహుల్ గాంధీ భేటీ

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం సమావేశమయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై గౌడ్ వివరించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. పార్టీ ఆర్గనైజేషన్ పరంగా జరుగుతున్న కార్యక్రమాలను కూడా టీపీసీసీ అధ్యక్షుడు స్పష్టంగా వివరించారు. ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బీఎల్ఏ నియామకాలు,...