27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్ /బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్ర శేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో గురువారం మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 7008 మంది అభ్యర్థులకు గాను 6754 మంది అభ్యర్థులు హాజరు కాగా, 253 మంది గైర్హాజర్ అయ్యారని భీమ్ గల్ లో ఒకరు డిబార్ అయ్యారని ఆయన తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష కు 4169 మందికి విద్యార్థులకు గాను 4042 మంది హాజరు కాగా 126 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షకు 2839 విద్యార్థులకు గాను 2712 మంది హాజరు కాగా, 127 మంది గైర్హాజరయ్యారు. నిజామాబాద్, ఆర్మూర్ లోని పలు పరీక్షా కేంద్రాలను అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్ర శేఖర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె.సంపత్ కుమార్ తో కలిసి పర్యవేక్షించారు.

 

Ongoing Degree Examinations

More articles

Latest article