బతుకమ్మ,ఏర్గట్ల: మండలంలోని బట్టాపూర్ గ్రామంలో ఐదు రోజుల క్రితం ప్రారంభమైన మండల స్థాయి క్రీకెట్ టోర్నమెంట్ క్రీడలు శనివారం తో ముగిసాయి. మొత్తం పదహెను జట్లు పాల్గొనగ నాగంపేట్ గ్రామానికి చెందిన క్రీకెట్ క్రీడాకారులు మొదటి బహుమతి గెలుపొందారు, వారికి పదివేల రూపాయల నగదు కప్పు, ద్వితీయ బహుమతి బట్టా పూర్ గ్రామానికి చెందిన యువకులు గెలుపొందారు, వారికి ఐదు వేల నగదు కప్పు ఆందుకున్నారు. ఇట్టి బహుమతులను గ్రామానికి చెందిన బాంపల్లి రాజు రెడ్డి, స్థానిక యువకుడు మూడ్ దయానంద్, అందజేశారు.ఈ కార్యక్రమం లో క్రీడాకారులు అజీమ్, నాగరాజ్, నరేందర్ యాదవ్,వర్షిత్ గౌడ్, ప్రవీణ్ యాదవ్, గద్దల గణేష్,సాయి,పవన్ గౌడ్, సతీష్ గౌడ్,సాయి కృష్ణ, తదితరులు,పాల్గొన్నారు.