25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి 

Must read

📰 Generate e-Paper Clip

  • మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ 

భీమ్ గల్  బతుకమ్మ :  కస్తూరిభా పాఠశాలలో విద్యానభ్యసిస్తున్న విద్యార్ధినులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ ఆదేశించారు.కలెక్టర్ ఆదేశానుసారం పట్టణంలోని కేజీవీబీ ( కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) హాస్టల్ ను  తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కిచెన్ గదిని, చుట్టూ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.కిచెన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి  సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు .విద్యార్థునుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు.  పప్పులు. కూరగాయలు. బియ్యము. ఇతర సరుకులు ఉండే రూములను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హాస్టల్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోకస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఇంచార్జ్ అనురాధ. మేనేజర్ నరేందర్. వార్డ్ ఆఫీసర్ కె.నవీన్. సంతోష్. ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ సున్నపు ఓంకార్. బిల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. జవాన్ రాజయ్య. హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article